Sorry bro...couldn't make it that day': Saitharam Tej
mictv telugu

‘సారీ తమ్ముడూ..ఆరోజు పలకలేకపోయా’: సాయిథరమ్ తేజ్

August 31, 2022

”నాకు ప్రమాదం జరిగిన రోజున ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నప్పుడు నువ్వు వచ్చి ‘అన్న..అన్న’ అని పదే పదే పిలిస్తుంటే, ఆరోజు నేను పలకలేకపోయా, సారీ తమ్ముడు. ఆరోజే నాకోక విషయం బాగా అర్థమైంది. కుటుంబ సభ్యులంతా కలిసుంటే ఎంత బాగుంటుందో, ఎంత ధైర్యంగా ఉండగలమోనని. నా తమ్ముడే నా బలం” అని హీరో సాయిథరమ్ తేజ్ అన్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా, కేతిక శర్మ హీరోయిన్‌గా దర్శకుడు గిరీశాయ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలు, ట్రైలర్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదలకాబోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో గతరాత్రి ప్రీ రీలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా సాయిథరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు విచ్చేశారు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..” మీ అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి రావటం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి వేడుకలకు వచ్చి, స్టేజ్‌పై మళ్లీ మాట్లాడతానని అనుకోలేదు. మీ ప్రార్థనల వల్ల నేను మళ్లీ తిరిగొచ్చా. 2021 నాకెంతో ప్రత్యేకం. మా తమ్ముడిని హీరోగా మీరు అంగీకరించటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నా చిత్రం ‘రిపబ్లిక్ షూటింగ్ పూర్తె, విడుదలవుతుందనేలోపు నాకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హెల్మెట్ వల్లే నేను బతికి ఉన్నా. వాహన ప్రయాణం చేసేటప్పుడు దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి. ఈ సినిమా నిర్మాత ప్రసాద్ గారు నాతో ‘సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రాన్ని తీశారు. ఇప్పటికీ నేను ఆ మాట (సోలో బతుకే బెటర్) కే కట్టుబడి ఉన్నా. మీరు ఉంటారా? ” అని సాయిధరమ్ తేజ్ ప్రేక్షకులను అడిగారు.