Soundarya Rajinikanth gave birth to a baby boy
mictv telugu

మగ బిడ్డకు జన్మనిచ్చిన..సౌందర్య రజనీకాంత్

September 12, 2022

దక్షిణాది సినీ ప్రియులకు సుపరిచితుడు, తమిళ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు, ఆ మగబిడ్డకు ‘వీర్ రజనీకాంత్ వనంగమూడి’ అనే పేరు పెట్టిసింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా రజనీకాంత్ అభిమానులతో పంచుకున్నారు. “దేవుని దయ, నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్ కృష్ణ తమ్ముడికి నేను, విషగన్ స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్లకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు.

 

ఇక, సౌందర్య రజనీకాంత్ విషయానికొస్తే..గ్రాఫిక్ డిజైనర్‌గా, నిర్మాతగా, దర్శకురాలుగా ఆమె తమిళ సినీ రంగంలో పని చేశారు. నటుడు రజినీకాంత్ రెండో కూతురే సౌందర్య. ఆమె అసలు పేరు షకు బాయ్ రావ్ గైక్వాడ్. ఓచెర్ పిక్చర్ ప్రొడక్షన్స్ అనే సంస్థకు ఆమె వ్యవస్థాపకురాలుగా, యజమానిగా ఉన్నారు. సినిమాల్లో గ్రాఫిక్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభి, మొదట్లో తన తండ్రి రజనీకాంత్ నటించిన సినిమాలకు టైటిల్ గ్రాఫిక్స్ చేశారు. ఆమెకు గతంలో వ్యాపారవేత్త అశ్విన్ కుమార్‌తో వివాహమైంది. వీరికి వేద్‌కృష్ణ జన్మించాడు. అయితే, ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2019లో వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని సౌందర్య పెళ్లాడారు. నిన్న వీరికి బాబు జన్మించాడు.