హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. అర్ధరాత్రి మళ్లీ శబ్ధాలు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. అర్ధరాత్రి మళ్లీ శబ్ధాలు

October 17, 2020

nvbnvbn

హైదరాబాద్ నగరవాసులకు వరుసగా సంభవిస్తున్న భారీ శబ్ధాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఇటీవల బోరబండ, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భూమి నుంచి భయంకర శబ్ధాలు వచ్చాయి. ఇవి జరిగిన రెండు రోజులకే మరోసారి కలకలం రేగింది.  రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్‌లో కూడా శుక్రవారం రాత్రి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 

సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహడీ షరీఫ్, ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి నుంచి వింత శబ్ధాలు వచ్చాయి. ఈ విన్న జనం వెంటనే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సంభవిస్తోందనే ప్రచారంతో అంతా ఆందోళన చెందారు. రాత్రాంతా రోడ్లపైనే బిక్కు బిక్కుమంటూ ఉండిపోయారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు అక్కడకు వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. కానీ ఈ శబ్ధాలు ఎందుకు వస్తున్నాయనే విషయం మాత్రం అధికారులు ఇంత వరకు తేల్చలేదు. దీంతో జనం భయపడిపోతూనే ఉన్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో ఇలాగే శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.