Sourav Ganguly Posts A Cryptic Tweet, Hints New Plan
mictv telugu

బీసీసీఐకి గంగూలీ రాజీనామా.. రాజకీయాల్లోకి.?

June 1, 2022

Sourav Ganguly Posts A Cryptic Tweet, Hints New Plan

భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనతో బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. 1992 నుంచి 2022 వరకు తన 30 ఏళ్ల క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగిందన్నారు.

ఈ ప్రయాణంలో ఎంతో మంది అండగా నిలిచారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని చెప్పిన దాదా.. ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. భవిష్యత్తు‌లో కూడా తనకు ఈ తరహా మద్దతే లభిస్తుందని ఆశిస్తున్నానని దాదా చెప్పుకొచ్చారు.

దాదా రాజీనామాతో ఆయన రాజకీయాల్లో చేరతారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలి కాలంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్‌షాతో గంగూలీ రెండుసార్లు భేటీ అవడం కూడా ఈ వదంతులకు కారణం అవుతోంది. త్వరలోనే గంగూలీ కాషాయ కండువా కప్పుకుంటారని, బీజేపీ తరఫున పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.