దక్షిణాది అందాల భామ కీర్తి సురేష్ కొత్త లుక్‌తో కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది. తెరముందు ముద్దుగా , పద్ధతిగా కనిపించే ఈ తార సోషల్ మీడియాలో మాత్రం తనలోని మరో యాంగిల్ ను పరిచయం చేసి రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆక్టివ్‌గా ఉంటున్న ఈ చిన్నది ఫ్యాషన్ అవుట్ ఫిట్స్‌ను ధరించి స్టైల్ మోయిన్టైన్ చేస్తూ లేటెస్టుగా చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ఫ్యాన్స్ గుండెల్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి బోల్డ్ అందాల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో షూట్ పిక్స్‌ను కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఫాలోవర్స్‌ని చిల్ చేస్తోంది.
ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత వేసే ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్‌కు మైలేజ్ ఇచ్చే పాత్రలను మాత్రమే ఎన్నుకుని ముందుకు వెళ్తేనే క్రేజ్ కంటిన్యూ అవుతుందని చాలా మంది స్టార్ హీరోయిన్లు నిరూపించారు. ఎక్కడ పొరపాటు చేసినా కథాబలం లేని కథలను ఎన్నుకున్నా బొక్కబోర్లా పడాల్సిందే. అందుకు ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తిపును సంపాదించుకుంది. ఆ తరువాత అమ్మడికి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. మరీ ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రం కీర్తికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చింది. కీర్తిని మహానటిని చేసింది. ఈ సినిమాకు గాను కీర్తి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.
అయితే బెస్ట్ యాక్ట్రెస్ అని అనిపించుకుంటున్న సమయంలో మహానటి తరువాత కీర్తి తన ఇమేజ్‌కు తగ్గ స్టోరీలను ఎన్నుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది. కమర్షియల్ నటిగా ప్రూవ్ చేసుకుందామనుకున్నా వర్కౌట్ కాలేదు. దీంతో కెరీర్ పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది కీర్తి. ఆఫర్లు వస్తున్నాయి కదా అని కథ చూసుకోకుండా చేసేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా చెప్పండి. దీంతో వరుస ఫ్లాపులతో కీర్తి కెరీర్‌కి డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం కీర్తి ఈ డ్యామేజ్‌ను పూడ్చుకునే పనిలో నిమగ్నమైంది. అందుకోసం డీగ్లామర్ రోల్‌కు ఓకే చెప్పి మరీ డేరింగ్‌గా ముందుకు వెళ్తోంది. నానితో కలిసి నటిస్తున్న దసరా చిత్రంలో కీర్తి మాస్ లుక్‌లో కనిపిస్తూ అందరిని కట్టిపడేస్తోంది.
దసరా సినిమాలో కీర్తి డీగ్లామర్ రోల్ లో కనిపించనుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర వస్తే కీర్తి ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటితో అది ప్రూవ్ చేసింది. ఈ సినిమాలోనూ కీర్తి పెర్ఫార్మెన్స్కు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించబోతోంది. దీంతో ఆశలన్నీ దసరాపైనే పెట్టుకుంది ఈ చిన్నది. దీంతో సినిమాను ఎలాగైనా హిట్ చేయాలన్న తపనతో తనదైన స్టైల్లో ప్రమోషన్స్‌ను చేస్తోంది కీర్తి సురేష్. అందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. ఫ్యాషన్ దుస్తులను ధరించి హద్దులు దాటి మరీ తన అందాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.