బ్యాటింగ్ బాగా చెయ్యాలంటే మాంసం పీకాల్సిందే..  క్రికెటర్ సలహా - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాటింగ్ బాగా చెయ్యాలంటే మాంసం పీకాల్సిందే..  క్రికెటర్ సలహా

January 9, 2020

Bangladesh.

బంగ్లాదేశ్ క్రికెటర్లకు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ కామెరూన్‌ డెల్‌పోర్ట్‌ ఉచిత సలహా ఇచ్చాడు. మాంసం ఎక్కువగా తిని భారీ హిట్ షాట్లు కొట్టాలని సూచించాడు. మాంసం ఎక్కువగా తీసుకోకపోవడం వల్లే ఆ దేశ ఆటగాళ్లు బౌండరీలు దాటించలేకపోతున్నారని పేర్కొన్నాడు. తాను  ఎక్కువగా మాంసం తినడం వల్లే భారీ షాట్లు కొట్టేవాడినని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆ దేశ ఆటగాళ్ల తీరుపై డెల్ పోర్ట్ ఈ విధంగా స్పందించడం ఆసక్తిగా మారింది. 

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆ దేశ ఆటగాళ్ల తీరు నిరాశ పరుస్తోంది. పొరుగుదేశాల ఆటగాళ్లతో పోల్చితే బంగ్లా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీనిపై  రంగ్‌పూర్‌ రేంజర్స్‌ తరఫున ఆడుతున్న డెల్‌పోర్ట్‌ ఆసక్తికర కామెంట్ చేశాడు. మాంసం డోస్ పెంచితే హిట్ షాట్లు కొట్టగలరని అన్నారు. బౌండరీ లైన్‌ పైనుంచి బంతిని హిట్‌ చేయాలంటే డోస్ పెంచాల్సిందేనన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు హిట్టర్లు కావడానికి  అదే కారణం అంటూ వ్యాఖ్యానించాడు. బంగ్లా పిచ్‌లో బంతి బౌన్స్‌ కావడం లేదని అటువంటి పిచ్‌పై ఆడాలంటే కండరాలకు మరింత శక్తి కావాలని సూచించాడు.