బౌలర్ల విజృంభణ.. 106 పరుగులే చేసిన సౌతాఫ్రికా - MicTv.in - Telugu News
mictv telugu

బౌలర్ల విజృంభణ.. 106 పరుగులే చేసిన సౌతాఫ్రికా

September 28, 2022

సౌతాఫ్రికాతో తిరువనంతపురంలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచులో భారత బౌలర్లు చెలరేగి ఆడారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం తొమ్మిది పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత కొంత తేరుకున్నా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేయగలిగింది. సఫారీ బ్యాటర్లలో కేశవ్ మహారాజ్ మాత్రమే 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

విధ్వంసక ఆటగాడిగా భావించిన మార్‌క్రమ్ 25 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. బారత బౌలర్లలో దీపక్ చహర్ రెండు, అర్షదీప్ సింగ్ మూడు, హర్షల్ పటేల్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఆల్ రౌండర్ అశ్విన్ వికెట్లు తీయకపోయినా నాలుగు ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చి సఫారీలను కట్టడి చేశాడు. భారత్ లక్ష్యం 107 పరుగులు కాగా, మన బ్యాటర్ల ప్రస్తుత ఫామ్ చూస్తే విజయం అలవోకగా సాధ్యమనిపిస్తుంది.