South African cricketer Mondli Khumalo assaulted in England
mictv telugu

చావుబతుకుల్లో సౌతాఫ్రికా క్రికెటర్‌.. తీవ్రగాయాలతో ఐసీయూలో…

May 31, 2022

South African cricketer Mondli Khumalo assaulted in England
సౌతాఫ్రికా క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలోపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చిన అతనిపై దుండగులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమంటున్నారు డాక్టర్లు.

విషయంలోకి వెళితే.. మే 29(ఆదివారం) మ్యాచ్‌ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు మొండ్లీ ఖుమాలో. బ్రిడ్జ్‌వాటర్‌ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్‌ స్ట్రీట్‌లో గ్రీన్‌ డ్రాగన్‌ పబ్‌ వద్ద కొందరు వ్యక్తులు అతనికి అడ్డువచ్చారు. తనకు ఎందుకు అడ్డువచ్చారని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.