South Asian film critic Umair Sandhu Controversial Tweets on Tollywood actors And Samantha abortion
mictv telugu

సమంతకు అబార్షన్, పవన్‌కు ఆడపిచ్చి.. ఎవడ్రా వీడు!

March 13, 2023

South Asian film critic Umair Sandhu Controversial Tweets on Tollywood actors And Samantha abortion

ఉమైర్ సంధు.. ఈ పేరు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. మూవీలపై రివ్యూలు ఇచ్చే ఈ మహానుభావుడి జోస్యాలు చిలక జోస్యాల్లా అప్పుడప్పుడు ఫలిస్తుంటాయి, చాలాసార్లు బెడిసికొడుతుంటాయి. ఈయనపై కేసులు కూడా ఉన్నాయని, గిట్టని వాళ్లు వేధించుకు తింటాడని చెబుతారు. విషయంలోకి వస్తే ఉమైర్ సంధు పేరుతో నిన్నటి నుంచి బోలెడు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ తారలను టార్గెట్ చేసుకుని వదిలిన ఈ ట్వీట్లపై జనంలో అయోమయం నెలకొంటోంది. ‘సమంతకు నాగచైతన్య అబార్షన్ చేయించాడు. పవన్‌కు ఆడపిచ్చి. సమంత, విజయ్ దేవరకొండ కశ్మీర్లో ఒకే గదిలో ఉన్నారు.. అనన్యా పాండే, ఆదికపూర్ కూడా అలాగే.. రవితేజ హీరోయిన్లను వేధిస్తాడు, తాకకూడని చోట తాకుతాడు.. ’’ ఇవీ ఉమైర్ సంధు పేరులో పేలిన ట్వీట్లు అయితే ఇవి నిజంగా అతని అధికారిక ట్విటర్ ఖాతా నుంచి వచ్చినవో కావో తెలియడం లేదు. ఉమైర్ అసలు ఖాతాకు బ్లూ టిక్ ఉండేదని, దీనికి లేదని, ఫాలోవర్లు కూడా చాలా తక్కువని నెటిజన్లు అంటున్నారు. ఈ ట్వీట్లపై ఆయా తారల అభిమానులు మండిపడుతన్నారు. ఈ అకౌంట్‌పై రిపోర్ట్ చేస్తామని, కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.