SOUTH CENTRAL RAILWAY announced 26 SPECIAL TRAINS TO SABARIMALA
mictv telugu

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త

November 11, 2022

SOUTH CENTRAL RAILWAY announced 26 SPECIAL TRAINS TO SABARIMALA

అయ్యప్ప మాలాధారణ ముగుస్తుండంతో శబరిమలకు రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వాములు, యాత్రికులు శబరిమలకు తరలివెళ్తున్నారు.ఈ నేపథ్యంలో శబరిమలకు వెళ్లి వచ్చే యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. యాత్రికుల రద్దీ దృష్ట్యా 26 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

* నవంబరు 20, డిసెంబరు 4, 18, జనవరి 8 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి కొల్లంకు 4 రైళ్లు

*నవంబరు 22, డిసెంబరు 6, 20, జనవరి 10తేదీల్లో కొల్లం నుంచి సికింద్రాబాద్‌కు 4 రైళ్లు,

*నవంబరు 27, డిసెంబరు 11,25, జనవరి 1,15 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి కొల్లంకు 5రైళ్లు

*నవంబరు 29, డిసెంబరు 13,27, జనవరి 3,17 తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్‌కు 5రైళ్లు

* నవంబరు 21,28 తేదీల్లో సికింద్రాబాద్‌-కొల్లంకు 2 రైళ్లు

*నవంబరు 23,30 తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్‌కు 2రైళ్లు

*నవంబరు 20, 27 తేదీల్లో సికింద్రాబాద్‌-కొట్టాయంకు 2 రైళ్లు

* నవంబరు 21,28 తేదీల్లో కొట్టాయం-సికింద్రాబాద్‌కు 2 ప్రత్యేక రైళ్లు