సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్ధం 24 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వివిధ స్టేషన్ల మధ్య జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్య ఈ రైళ్లను నడుపుతామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడనున్న భారీ రద్దీని నివారించడానికే ఈ ఏర్పాటు చేసినట్టు మంగళవారం సాయంత్రం రైల్వే సీపీఆర్వో రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లలో రిజర్వ్ కోచ్ లు , అన్ రిజర్వ్ డ్ కోచ్ లు ఉంటాయని వివరించారు. అంతేకాక ఆ జాబితాను రిలీజ్ చేశారు. అందులో ఏయే స్టేషన్ల మధ్య రైళ్లున్నాయి? ఏ ఏ తేదీల్లో బయల్దేరనున్నాయి? వంటి వివరాలు పొందుపరిచారు.