south central railway cancelled and restored these trains here full details
mictv telugu

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు రద్దు!

July 9, 2022

south central railway cancelled and restored these trains here full details

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రైళ్లను పునరుద్ధరిస్తునట్లు ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ ట్రైన్‌ (Train No.07595)ను జూలై 9వ తేదీ నుండి 20 వరకు రద్దు చేస్తునట్లు సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ తెలిపింది. నిజామాబాద్- నాందేడ్ రైలును(Train No.07853) , నాందేడ్-నిజామాబాద్ ట్రైన్(Train No.07854) ను ఈ నెల 21 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా చెప్పారు. ప్రయాణికులు ఇది గమనించి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే వాస్తవానికి 07853/07854 రైళ్లను ఈ నెల 11 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఈ నెల 4న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే. అయితే.. ఇప్పుడు ఆ తేదీని 21 వరకు వాయిదా వేసింది.

ఇక రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండడంతో.. అధికారులు అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వారాంతం కావడంతో అనేక మంది సొంతూళ్లకు ప్రయాణమవుతుంటారు. కానీ ప్రస్తుతం వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండడంతో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.