South central railway cancelled trains in Khammam Vijayawada route diversion
mictv telugu

ఖమ్మం – విజయవాడ మధ్య ఈ రైళ్లు రద్దు

September 10, 2022

South central railway cancelled trains in Khammam Vijayawada route diversion

ఒక పక్క వర్షాలకు పలు రైళ్లు రద్దవుతుంటే మరోపక్క సాంకేతిక కారణాలతో మరికొన్ని దారి మళ్లుతున్నాయి. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే విభాగం రద్దు చేసి కొన్న దారి మళ్లించింది. పట్టాల నిర్మాణం, ఆధునీకరణ, పాత పట్టాలకు లింకులు కలపడం వంటి పనుల కారణం విజయవాడ వైపు వెళ్లే రైళ్లను దారి మళ్లించారు.

విజయవాడ డివిజన్‌ పరిధిలోని కొండపల్లి- రాయనపాడు మధ్య మూడో లైను పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖాజీపేట-తిరుపతి స్పెషల్ రైలు, తిరుపతి-ఖాజీపేట స్పెషల్ రైళ్లు, ఖమ్మం- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు అయ్యాయి. సికింద్రాబాద్‌- గుంటూరు మధ్య నడిచే గోల్కొండ, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సికింద్రాబాద్‌ నుంచి ఖమ్మం వరకు నడుపుతున్నారు. విజయవాడ, గుంటూరు, నల్లగొండ రూట్లో మరికొన్ని నడుపుతున్నారు. సికింద్రాబాద్‌- తిరుపతి ప్రత్యేక రైలు ద్రోణాచలం, గుత్తి మీదుగా నడుపుతున్నారు.