దక్షిణమధ్య రైల్వే.. 574 స్టేషన్లలో ఫ్రీ హైస్పీడ్ వైఫై - MicTv.in - Telugu News
mictv telugu

దక్షిణమధ్య రైల్వే.. 574 స్టేషన్లలో ఫ్రీ హైస్పీడ్ వైఫై

November 20, 2019

South central railway established high speed wifi in 574 stations

దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని స్టేషన్‌లను వడివడిగా ఆధునీకరిస్తోంది. ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించడానికి ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో ఎస్సిఆర్ పరిధిలోని 574 స్టేషన్‌లలో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైల్వే ఉన్నతాధికారులు బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో ఈ ఏర్పాట్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఏ1 కేటగరీలోని 5 స్టేషన్లు, ఏ కేటగరీలోని 31, బీ కేటగరీలోని 38, సీ కేటగరీలోని 21, డీ కేటగరీలోని 78, ఇ కేటగరీలోని 387, ఎఫ్(హాల్ట్) కేటగరీలోని 2, కొత్తగా నిర్మితమైన 12 స్టేషన్లలో ఉచితంగా హైస్పీడ్ వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లైంది. మొత్తం అన్ని స్టేషన్లలోనూ ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎస్సీఆర్‌‌దే అని అధికారులు తెలిపారు.