South Central Railway has announced that 15 trains including MMTS will be canceled due to heavy rains.
mictv telugu

భారీ వర్షాలు.. రేపటి నుంచి ఎంఎంటీఎస్ సహ పలు రైళ్లు రద్దు..

July 13, 2022

South Central Railway has announced that 15 trains including MMTS will be canceled due to heavy rains.

భారీ వర్షాల కారణంగా 15రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రేపటినుంచి ఈనెల 17వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు.

సికింద్రాబాద్, ఉందాన‌గ‌ర్, మేడ్చ‌ల్, బొల్లారం స్టేష‌న్ల మ‌ధ్య న‌డిచే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ ప్ర‌త్యేక ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెము ప్ర‌త్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చ‌ల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజ‌ర్ రైలు ర‌ద్దు అయింది. సికింద్రాబాద్ – మేడ్చ‌ల్ – సికింద్రాబాద్ మెము రైలు, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైళ్ల‌ను కూడా ర‌ద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు- విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నెల 17వరకు 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.