నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. (South Central Railway). రైల్వే శాఖలో ఉన్న భారీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మొత్తం 4103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కాగా…జనవరి 29,2023 వరకు ఆఖరీ తేదీగా నిర్ణయించింది దక్షిణ మధ్య రైల్వే.
మొత్తం ఖాళీల సంఖ్య : 4103
అర్హత:
ఇక సౌత్ రైల్వే రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం…అభ్యర్థులు 50శాతం మార్కులతో పదవ తరగతి పాసై ఉండాలి. ఎన్సివిటి లేదా ఎస్సివిటి నుంచి గుర్తింపు పొందిన సంస్థ ఐటీఐ సర్టిఫికేట్ ను పొంది ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 30, 2022 నాటికి కనిష్టంగా 15 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు నిండి ఉండాలి.
వయోపరిమితి సడలింపు:
OBC(NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాల
SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల
PWD అభ్యర్థులు- 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:
SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
మిగతా అభ్యర్థులకు-రూ.100
చెల్లింపు విధానం – ఆన్లైన్
జీతం:
అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.
ఉద్యోగ స్థలం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , కర్ణాటక , తెలంగాణలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.