వేసవిలో ద.మ. రైల్వే ప్రత్యేక రైళ్లు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

వేసవిలో ద.మ. రైల్వే ప్రత్యేక రైళ్లు ఇవే..

May 21, 2022

వేసవిలో టూర్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఉత్తర భారతం, దక్షిణ భారతాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, నగరాల నుంచి ఇవి నడుస్తాయి. మే, జూన్ నెలల్లో నడిపే స్పెషల్ రైళ్ల వివరాల జాబితాను అధికారులు విడుదల చేశారు.

హైదరాబాద్, సికింద్రాబాద్, చిత్తూరు, తిరుపతి, బెంగళూరు కంటోన్మెంట్, ఎర్నాకుళం, చెన్నై రామేశ్వరం, మదురై, విశాఖ, శ్రీకాకుళం, గోరఖ్‌పూర్, కటక్, దాదర్, నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి వీటిని నడపుతున్నట్లు వెల్లడించారు.

వీటిలో ఖాజీపేట నుంచి దాదార్ కు 22 రైళ్లు ఉండడం విశేషం. ప్రత్యేక రైళ్లు బయల్దేరే స్థలాలు, వాటి గమ్య స్థలాలు, తేదీల వివరాలను అధికారులు వెల్లడించారు.