south Indians cracke the most jokes at work
mictv telugu

నవ్వించడంలో మనవాళ్ళే టాప్

November 17, 2022

నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం…అన్నాడు జంధ్యాల. దీన్ని అక్షారాల పాటిస్తారుట మన దక్షిణాది వాళ్ళు. జోక్స్ క్రాక్ చేయడంలో మాకు సాటి ఎవరూ లేరంటూ దూసుకుపోతున్నారు. ప్రపంచం మొత్తంలో పనిచేసే చోట ఎక్కువగా జోకులు వేసి నవ్వించేది మన సౌత్ ఇండియన్సేనట.

నవ్వుతూ బతకాలి రా తమ్ముడూ….నవ్వుతూ చావాలి రా అని ఒక పాట. నిజమే కదా అలా హాయిగా నవ్వుతూ ఉంటే జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది కదా. అవతలి వాళ్లు నవ్వుతుంటే మన మొహంలో కూడా ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంది. కాదంటారా. ముఖ్యంగా పని చేసే చోట ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే శ్రమ అంతా మర్చిపోయి ఆడుతూ పాడుతూ పని చేసేసుకోవచ్చు. ఇది హండ్రడ్ పర్శంట్ నిజం అంటున్నారు మన సౌత్ ఇండియన్. అందుకే జోకులతో ఆఫీసులను ముంచెత్తుతూ….తాము నవ్వుతూ, అవతలి వాళ్ళని నవ్విస్తూ హాయిగా పని చేసుకుని పోతున్నారు. అవునండీ నిజం, ప్రపంచం మొత్తంలో పని చేసే చోట ఎక్కువగా జోకులు వేసి నవ్వించేది మన సౌత్ ఇండియన్సేనట.

దక్షిణాది వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉంటుంది అంటున్నారు ప్రపంచ దేశాలవాళ్ళు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు వచ్చామా, పని చేసామా, వెళ్ళామా అని ఉండరుట సౌత్ ఇండియన్స్. తాము ఎక్కడ ఉంటే అక్కడ జోకులు క్రాక్ చేస్తూ అందరినీ నవ్విస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలబడతారుట. దక్షిణాది వాళ్ళతో పని చేయడమంటే భలే మజా అని చెబుతున్నారు అందుకే. లింక్డిన్ చేసిన ఒక సర్వేలో 43 శాతం మంది ఇండియన్స్ ఇలా నవ్విస్తూ పనిచేయడానికి ఇష్టపడతారని తేలిందట. మన తర్వాత స్థానం ఇటలీ కొట్టేసింది. మొత్తానికి ఇండియా, ఇటలీ వాళ్ళ హ్యూమర్ సూపర్ సే భీ ఊపర్ అంట.

నవ్వుతూ, నవ్విస్తూ పని చేస్తే అందులో ఉన్న స్ట్రెస్ తగ్గుతుందట. భయాలు, అనుమానాలు, జంకులు ఏమీ లేకుండా అన్నీ షేర్ చేసుకుంటూ హాయిగా పనిచేసుకుంటారుట. ఇది నిజంగా నిజం అంట అండీ… దీనిని మన ఇండియన్స్ చేసి మరీ చూపిస్తున్నారండీ బాబూ, నమ్మకతప్పదు. కానీ మన ఆడ లేడీస్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారుట. ఎప్పుడూ సీరియస్ గా పని చేసుకుంటూ ఉంటారుట. అమ్మా లేడీస్ ఎందుకండీ అంత సీరియెస్ నెస్, హాయిగా నవ్వేయండి చెప్తాను. మన దక్షిణాది వాళ్ళల్లా హాయిగా నవ్వుకుంటూ పనిచేసుకోండి. మీ మీద ఉన్న బర్డెన్స్ అన్నీ తగ్గించుకోండి.

ఉన్నది ఒకటే జిందగీ….దాన్ని హాయిగా నవ్వేస్తూ గడిపేద్దాం. సాధ్యమైనంత వరకూ నవ్వూతూ, నవ్విస్తూ గడిపితే మన జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్ళు కూడా మర్చిపోవచ్చు. విజయాలు సాధించవచ్చు.