Home > Featured > ఫోన్లు చూసుకునే వారి కోసం ప్రత్యేకం!

ఫోన్లు చూసుకునే వారి కోసం ప్రత్యేకం!

స్మార్ట్ సమస్యలకు.. స్మార్ట్ పరిష్కారాలు అవసరం. స్మార్ట్ ఫోన్ పై ఉన్న మక్కువ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా చేస్తుంది. దీనికి పరిష్కారం ఆలోచించింది సౌత్ కొరియా. అదేమిటో మీరూ చదివేయండి. రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడే కాదు.. నడిచేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే! మనం బాగానే వెళుతున్నా.. ఎదుటివారు సరిగా వస్తారో లేదో తెలియదు. పైగా ఫోన్స్ చూస్తూ నడిచే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువ అయిందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటితే ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించారా? మీరేమో కానీ సౌత్ కొరియా ప్రభుత్వం ఆలోచించి ఒక చక్కటి ఆలోచన చేసింది.

చిన్న వయసు నుంచి.. పెద్ద వాళ్ల దాకా ఫోన్ ముఖంలో పెడితే పక్కకు తిప్పడం అంటూ ఉండడం లేదు. ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పోతుంది. రోడ్డు దాటేప్పుడు ట్రాఫిక్ లైట్లను గమనించకుండా దాటే వారి సంఖ్య పెరుగుతుందని సౌత్ కొరియా ప్రభుత్వం భావించింది. దీంతో యాక్సిడెంట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నదట. దీనికొక స్మార్ట్ ఆలోచన చేసిందా ప్రభుత్వం. మామూలు ట్రాఫిక్ లైట్లతో పాటు.. పేవ్మెంట్ మీద కూడా ఈ ట్రాఫిక్ లైట్లను జీబ్రా క్రాసింగ్ దగ్గర ఉంచింది. దీంతో మామూలు ట్రాఫిక్ లైట్లతో పాటు.. ఈ లైట్స్ కూడా ఎరుపు, ఆకుపచ్చ లైట్లను చూపిస్తుంది. మీరు ముఖం ఫోన్ లో పెట్టినా ఆ లైట్లు పేవ్మెంట్ మీద ఉంటాయి కాబట్టి కొంత అలర్ట్ అవుతారు. దాన్ని బట్టి రోడ్డు దాటాలో మీరే తెలుసుకుంటారు. దీంతో పాటు ఫోన్లో ట్రాఫిక్ లైట్ అలర్ట్ కూడా వచ్చేలా సౌత్ కొరియా కొన్ని మార్పులు చేస్తున్నది. 2019నుంచి ఇది ట్రయల్ ప్రాజెక్ట్గా మొదలైంది. పూర్తి ఎత్తున్న వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలని భావిస్తున్నది అక్కడి ప్రభుత్వం. ఈ విషయం తెలుసుకున్న చాలామంది తమ సమస్య తీరిపోతుందని సంతోషిస్తున్నారు. కేవలం అక్కడే కాకుండా మిగతా దేశాల్లో కూడా ఇదే స్మార్ట్ సొల్యూషన్ తీసుకొస్తే మరెంతమంది సంతోషిస్తారు. ఇది చదువుకుంటూ కూడా మీ ముందు ఏం జరుగుతుందో గమనించడం లేదనుకుంటా! ఒకసారి మీ చుట్టుపక్కలకు ఒక లుక్కేయండి.

Updated : 24 Nov 2022 7:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top