South Korea says North Korea test-fired missile toward sea
mictv telugu

రెచ్చ‌గొడుతోన్న ఉత్త‌ర‌ కొరియా-బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం

September 25, 2022

స్వ‌ల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిప‌ణిని ప్ర‌యోగించి ఉద్రిక్త‌త‌లు రాజేసింది ఉత్త‌ర‌ కొరియా. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్ అనే ప్రదేశం నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగినట్టు దక్షిణ కొరియా తెలిపింది. 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ క్షిపణి 600 కిలోమీటర్ల దూరంలో పడింది. దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త విన్యాసాలకు అమెరికా రెడీ కావడం, ఇంకొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ దక్షిణ కొరియాను సందర్శించనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణిని ప్రయోగించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ క్షిపణి పరీక్షపై దక్షిణ కొరియా తీవ్రంగా స్పందించింది. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని పేర్కొంది. తాము కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని జపాన్ కోస్టు గార్డు కూడా ధ్రువీకరించింది. ఇటీవల ఉత్తర కొరియా తనను తాను అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకుంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను సైతం తోసి 2006 నుంచి 2017 వరకు ఉత్తరకొరియా ఆరుసార్లు అణ్వాయుధాలను పరీక్షించింది.