రైల్వేలో ఉద్యోగం కోరుకుంటున్న నిరుద్యోగ యువతీయువకులకు గుడ్‌న్యూస్. దక్షిణ రైల్వే స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు? వంటి వివరాలు మీకోసం..
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2 జనవరి 2023. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ iroams.com ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
అర్హత..
12వ తరగతి(ఇంటర్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు 7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 2/3లో పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మాత్రమే 7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 4/5లో పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి..
అభ్యర్థి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయోపరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు కూడా నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500గా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికులు/పీడబ్ల్యూడీ/మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మరియు ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఫీజు రూ. 250గా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లింపు చేయవచ్చు.
ఇలా అప్లై చేసుకోండి..
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు iroams.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇక్కడ వెబ్సైట్లో ఇవ్వబడిన అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.