Southwest monsoon to set over Telangana in first week of June
mictv telugu

ఈసారి కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

May 13, 2022

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల 5 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముంది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగానే పలకరిస్తాయని, అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఈ నెల 15న ఈ సీజన్‌ తొలి వర్షాలు కురవొచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం తెలిపింది.

మే 15కల్లా నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్న ఐఎండీ.. వచ్చే నెల 5 నుంచి 8 మధ్య నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి విస్తరించే అవకాశముందని చెప్పారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు ఐఎండీ తెలిపింది
కేరళలోనూ రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చే పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా ఏటా జూన్‌ 1న రుతు పవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి.