రాకెట్ కూలిపోయింది.. వ్యోమగాముల కోసం వెతుకులాట - MicTv.in - Telugu News
mictv telugu

రాకెట్ కూలిపోయింది.. వ్యోమగాముల కోసం వెతుకులాట

October 11, 2018

అంతరిక్ష ప్రయోగాలు కత్తిపై సాములాంటివి. రాకెట్ ప్రయోగాల్లో ఎక్కడ ఏ కొంచెం తేడా కొట్టినా కోట్ల డబ్బు వ్యర్థమైపోతుంది. పైగా అందులో మనుషులు కూడా ఉంటే, పూడ్చలేని నష్టం తలెత్తుతుంది. అయితే పెరిగిన టెక్నాలజీ సాయంతో ప్రాణనష్టాన్ని తగ్గించే సదుపాయాలు కూడా సమకూర్చుకుంటున్నాయి పరిశోధన సంస్థలు. ఈ రోజు నింగికెగసిన రాకెట్ అటు రష్యా, ఇటు అమెరికాల గుండెల్లో గుబులు రేపుతోంది. నింగిలో ఎమర్జెన్సీ ల్యాండయిన ఇద్దరు వ్యోమగాములను రక్షించేందుకు రెండు దేశాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి.

రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కజకిస్తాన్ నుంచి ఈరోజు సోయుజ్ వ్యోమనౌకను పంపారు. అందులో నిక్ హేగ్(అమెరికా), అలెక్సీ ఓవచినిన్(రష్యా) అనే వ్యోమగాములు ఉన్నారు. తొలుత రాకెట్ ఎలాంటి సమస్యలూ లేకుండానే పైకి ఎగిరిగింది. అయితే భూమికి 50 కి.మీ ఎత్తులో వెళ్తుండగా బూస్టర్‌లో లోపాలు తలెత్తాయి. దశ మార్చుకుని కూలిపోసాగింది. దీంతో రాకెట్ అగ్రభాగంలోని వ్యోమగాముల క్యాప్యూల్స్ విడివడి నింగిలో సురక్షింతగా నిలిచిపోయింది. ప్రస్తుతం వారిద్దరూ రేడియో కాంటాక్టులో ఉన్నారని, మరో వ్యోమనౌకను పంపి, వారిని వెతికి పట్టుకుని సురక్షితంగా భూమిపైకి తీసుకొస్తామని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.