ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ విడుదల.. ఎలా ఉన్నారంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ విడుదల.. ఎలా ఉన్నారంటే

August 15, 2020

SP Balasubrahmanyam Health Update

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడటంతో ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించింది. అతన్ని వెంటిలేటర్‌పై ఉంచడంతో అంతా ఆందోళన చెందారు. దీంతో  చెన్నై ఎంజీఎం వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన క్షేమంగా ఉన్నారని ప్రస్తుతం కోలుకుంటున్నారని వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ పై ఇంకా చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. 

ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తుందని ఎంజీఎం వైద్య సేవల విభాగం ఏడీ డాక్టర్ అనురాధ భాస్కరన్ వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ అభిమానుల కోసం ఓ ఆడియో సందేశాన్ని పంపిచారు. తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని, నాన్నా సేఫ్ అంటూ పేర్కొన్నారు. కాగా ఆగస్టు 5న ఆయన కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఎస్పీ ఆరోగ్య విషయం తెలిసి పలువురు ప్రముఖులు సహా అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే.