బాలుకు కన్నీటి నివాళి.. నటులు, ప్రముఖులకే అనుమతి - MicTv.in - Telugu News
mictv telugu

బాలుకు కన్నీటి నివాళి.. నటులు, ప్రముఖులకే అనుమతి

September 26, 2020

nbh

కోట్లాదిమందిని తన గాత్రంతో మంత్రముగ్ధులను చేసే విధంగా పాటలు పాడి ఆలసిపోయిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కడసారి చూసేందుకు పలువురు తరలివస్తున్నారు.  చెన్నైలోని తామరైపాక్కంలోని ఫాం హౌజ్‌లో శనివారం అంత్యక్రియలు చేయనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. బాలు మరణ వార్త తెలిసిన తర్వాత నివాళ్లు అర్పించేందుకు నటులు, రాజకీయ, ఇతర ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. 

కరోనా నేపథ్యంలో నటులు, ప్రముఖులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అభిమానులు ఎవరూ రావద్దని సూచించారు. ముందు జాగ్రత్తగా ఫాం హౌజ్‌కు కొంత దూరం ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లోనే సంప్రదాయం ప్రకారం ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. వీర శైవ జంగమ సంప్రదాయం ప్రకారం కూర్చున్న స్థితిలో ఖననం చేసి తుది వీడ్కోలు పలకనున్నారు. కాగా, అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ ఆయన నిన్న మద్యాహ్నం మరణించారు. అప్పటి నుంచి అభిమానులు, సినీ ప్రపంచం శోఖసంద్రంలో మునిగిపోయింది.