బై బై బాలు.. గానగంధర్వుడికి అంతిమవీడ్కోలు - MicTv.in - Telugu News
mictv telugu

బై బై బాలు.. గానగంధర్వుడికి అంతిమవీడ్కోలు

September 26, 2020

balu01

లెజెండరీ సింగ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న ఆయన ఫాం హౌజ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ముగించారు. వైదిక శైవ సంప్రదాయం ప్రకారం క్రతువుతో సమాధి చేశారు. భార్య సావిత్రమ్మ, కొడుకు చరణ్, కూతురు పల్లవి, సోదరి ఎస్పీ శైలజ చివరి క్రతువు నిర్వహించారు. ఆయన్ను కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందు జాగ్రత్తగా అధికారులు అభిమానులను ఎవరినీ అక్కడికి అనుమతించలేదు.  

కాగా,గత నెల 5న కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత నెగెటివ్ వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం కన్నుమూశారు. ఏపీ ప్రభుత్వం తరుపున మంత్రి అనిల్ కుమార్ అంత్యక్రియలకు హాజరు అయ్యారు. పలువురు నటులు, సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళ్లు అర్పించారు. చివరి క్షణంలో తమిళ స్టార్ హీరో విజయ్ అక్కడకు వచ్చారు భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని హీరో అర్జున్ అభిప్రాయపడ్డారు.