కాబోయే ప్రధాని మాయావతే.. అఖిలేశ్ యాదవ్ - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే ప్రధాని మాయావతే.. అఖిలేశ్ యాదవ్

May 14, 2019

దేశానికి కాబోయే ప్రధానమంత్రి బహుజన్ సమాజ్‌వాదీ అధినేత్రి మాయావతే అని జోస్యం చెప్పారు  సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్. మాయావతికే దేశ ప్రధాని అయ్యే తగిన అనుభవం, లక్షణాలు పుష్కలంగా వున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్‌ మాట్లాడుతూ..

‘ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లు కాకుండా మహాకూటమి నుంచి ఆమే ప్రధాని అవుతారు.  మాయావతి బీజేపీకి మద్దతు ఇవ్వరని నేను కచ్చితంగా చెప్పగలను. ఈసారి ప్రధాని మా రాష్ట్రం నుంచే ఉంటారు’ అని ఘంటాపథంగా చెప్పారు అఖిలేష్. ఈ ఎన్నికల్లో తాము బీజేపీ, కాంగ్రెస్‌తో పోటీ పడ్డామని, కాంగ్రెస్‌ తమతో చర్చలు జరపలేదని ఆయన అన్నారు. ప్రత్యర్థులను వ్యక్తిగతంగా  ప్రధాని మోదీ  విమర్శించడం బాగాలేదన్నారు