ఆస్పత్రిలో దమ్మేసిన ఎస్పీ నేత.. నెట్టింట్లో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్పత్రిలో దమ్మేసిన ఎస్పీ నేత.. నెట్టింట్లో వైరల్

November 23, 2019

బహిరంగ ప్రదేశాల్లో పోగతాగడం నేరం. ఇలాంటి వాటికి భారీగా జరిమానా ఉంటుందని ప్రభుత్వాలు యాడ్స్ కూడా వేస్తాయి. కానీ అవేవీ పట్టని సమాజ్ వాదీ పార్టీ నేత మాత్రం దర్జాగా ఆస్పత్రి ప్రాంగణంలో దమ్మేశాడు. ఉత్తరప్రదేశ్ మోర్దాబాద్‌లోని ప్రభుత్వ హాస్పిటల్ హాజీ ఇక్రమ్ ఖురేషి పొగ తాగడం వివాదాస్పదంగా మారింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాప్రతినిధి ఇలా పబ్లిక్ ప్లేస్‌లో పొగ తాగడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. 

ఈనెల 22న ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా మోర్దాబాద్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన బయటకు వచ్చిన వెంటనే సిగరేట్ తాగుతూ కనిపించారు. ఆ సమయంలో అక్కడే పలువురు రోగులు అటూ ఇటూ వెళ్తూ ఉన్నారు. అక్కడే ఉన్న కొంత మంది ఈ ఘటనను వీడియో తీయడంతో ఆ పక్కనే ఉన్న పార్క్ దగ్గరలో పొగతాగినట్టు వెల్లడించారు. కావాలనే తన ప్రత్యర్థులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.