పుకార్లతో నన్ను బాధించకండి.. - MicTv.in - Telugu News
mictv telugu

పుకార్లతో నన్ను బాధించకండి..

September 7, 2017

ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని, ఆయన పరిస్థితి రేపోమాపో అన్నట్లు ఉందని కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వీటిపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈమేరకు ఓ వీడియో మెసేజ్ ను మీడియాకు విడుదల చేశారు. ‘నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. చాలా మంది నా ఆరోగ్యం గురించి వాకబు చేసినప్పుడు షాక్ అయ్యాను. ఎందుకు ఈ పుకార్లు సోషల్ మీడియో పుట్టిస్తున్నారో నాకర్థం కావడం లేదు. నేను తీవ్ర అనారోగ్యంతో ఉన్నానని పుకారు పుట్టించారు. దీని వల్లే నా ప్రదర్శనలన్నీ రద్దు చేసుకున్నాని చెబుతున్నారు. దగ్గు, జలుబు లాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తాను. ఆ సమయంలో నన్ను చూసిన కొందరు నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని అనుకోవడం మూర్ఖంత్వం. నా ప్రదర్శనలన్నీ రద్దు చేసుకోవడం వెనుక వేరే కారణం ఉంది. ఆగస్టు 23న నా చెల్లెలు గిరిజ ఆకస్మికంగా చనిపోయారు. కాబట్టి 10 నుంచి 12 రోజులు నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత సెప్టెంబర్ 2న బెంగళూరులో ఒక సంగీ ప్రదర్శన కూడా ఇచ్చాను. దయచేసి అనవసరంగా ఇలాంటి పుకార్లు సృష్టించి మమ్మల్ని బాధించకండి’ అని బాలు చెప్పారు.  ప్రస్తుతం తాను రామోజీ ఫిల్మ్ సిటీలో ‘స్వరాభిషేకం’ షూటింగ్‌లో ఉన్నానని తెలిపారు.