రియాలిటీ షో విజేతకు గిఫ్ట్‌గా అంతరిక్ష యాత్ర.. - MicTv.in - Telugu News
mictv telugu

రియాలిటీ షో విజేతకు గిఫ్ట్‌గా అంతరిక్ష యాత్ర..

September 21, 2020

Space Hero reality TV contest to send winner to ISS in 2023

టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో విజయం సాధించే వారికి నగదు, కార్లు, బైకులు బహుమతులుగా ఇస్తుంటారు. కానీ, అమెరికాకు చెందిన ఓ ప్రొడక్షన్‌ కంపెనీ రూపొస్తుందిస్తున్న ‘స్పేస్ హీరో’ అనే రియాల్టీ షో విజేతను అంతరిక్ష యాత్రను బహుమతిగా ఇవ్వనుందని ప్రకటించింది. ఈ షో ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పోటీలు పెడతారనే విషయాలు తెలియాల్సి ఉంది. 2023లో ఈ షో విజేతను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతామని స్పేస్ హీరో రియాల్టీ షో నిర్వాహకులు ప్రకటించారు. 

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులను ఒక్కచోటకు చేర్చి అంతరిక్ష కేంద్రంలో ఉండగలరా లేదా అని శారీరక, మానసిక పరీక్షలు నిర్వహిస్తారు. వారి ప్రదర్శన, ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. తదనంతరం విజేతను పది రోజుల అంతరిక్ష యాత్రకు పంపిస్తారు. ఇందుకోసం ప్రైవేటు స్పేస్‌ మిషన్‌ సంస్థ అయిన ‘యాక్సివోమ్‌ స్పేస్‌’తో స్పేస్‌ హీరో రియాల్టీ షో నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు. త్వరలో నాసాతో సంప్రదింపులు జరిపి ఈ రియాల్టీ షో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.