SpaceX rocket booster explodes in Texas
mictv telugu

వీడియో : మస్క్‌కు ఎదురు దెబ్బ.. పేలిన స్పేస్ ఎక్స్ రాకెట్ బూస్టర్

July 12, 2022

ట్విట్టర్ డీల్ నుంచి తప్పుకోవడంతో ఇప్పటికే పతనమవుతున్న టెక్సా షేర్ల ధరలు పడిపోతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలోని టెక్సాస్‌లో తనకు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ బూస్లర్ ప్రయోగ దశలో పేలిపోయింది. ఈ దృష్యాలను నాసాకు చెందిన అధికార వెబ్‌సైట్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వివరాల్లోకెళితే.. మార్స్‌పై మనిషి మనుగడకు సంబంధించిన అంశాలు కనుగొనడం, చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టేలా సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్‌లను ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కృషి చేస్తోంది. అందుకోసం రాకెట్లను రూపొందించి ప్రయోగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తయారు చేసిన 120 మీటర్ల సూపర్ హెవీ ఫస్ట్ స్టేజ్ బూస్టర్ 7 ప్రోటో టైప్‌ను ప్రయోగించింది. ఈ క్రమంలో రాకెట్ బూస్టర్ ఒక్కసారిగా పేలిపోయి ముక్కలైంది. దీనిపై మస్క్ స్పందిస్తూ.. ‘ఇలా జరగడం దురదృష్టకరం. పేలుడు వల్ల కలిగిన నష్టాన్ని మా బృందం అంచనా వేస్తోంద’ని ట్వీట్ చేశాడు. కాగా, ఇప్పటికే ఆర్ధిక కష్టాలతో సతమతమవుతున్న మస్క్‌కు ఈ ఘటన మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.