భూమిని ఢీకొట్టనున్న చైనా రాకెట్ శకలాలు.. ఎయిర్‌పోర్టుల మూసివేత - MicTv.in - Telugu News
mictv telugu

భూమిని ఢీకొట్టనున్న చైనా రాకెట్ శకలాలు.. ఎయిర్‌పోర్టుల మూసివేత

November 4, 2022

Spain closes airports due to Chinese rocket

చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ గ్రహ శకలాలు భూమిని తాకనున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడ పడతాయనే దానిపై కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. స్పెయిన్ దేశంపై పడుతుందనే ప్రాథమిక అంచనా నేపథ్యంలో ఆ దేశం అప్రమత్తమైంది. దేశ గగనతలంతో పాటు అనేక విమానాశ్రయాలను మూసివేసింది. దీంతో పలు విమానాల రాకపోకలు నిలిచిపోగా, ప్రజలు సహకరించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. తియాంగాంగ్ పేరుతో చైనా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. దీని కోసం సోమవారం ఆ దేశం చివరి మాడ్యూల్‌ని 23 టన్నుల బరువున్న లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా భూమి నుంచి స్పేస్‌లోకి పంపింది.

మాడ్యూల్‌ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన లాంగ్ మార్చ్ 5బీ.. శనివారం రాత్రిలోపు భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. దాదాపు 10 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉండే ఈ రాకెట్ కొంత వరకు కాలిపోనుండగా, మిగిలిన ప్రధాన భాగాలు మాత్రం భూమిపై పడతాయని అంచనా వేస్తున్నారు. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ నియంత్రణ కోల్పోతుందని వెల్లడి కావడంతో పలు దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి.