లగేజీ మోసుకొచ్చిన రాజు.. మన నేతలూ ఉన్నారు..  - MicTv.in - Telugu News
mictv telugu

లగేజీ మోసుకొచ్చిన రాజు.. మన నేతలూ ఉన్నారు.. 

December 2, 2019

Spain king carl carries his own bags at airport 

మన దేశ రాజకీయ నాయకులు అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఎంత హంగామా జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. వీఐపీ ఏర్పాటు, బుగ్గకార్లు, అనుచరుల హడావుడి, బౌన్సర్లు, సెక్యూరిటీ.. అన్నిటికీ మించి రోడ్లపై సామాన్యులకు ట్రాఫిక్ నరకం.. మరెన్నో చెప్పుకోవచ్చు. అంతేనా, సదరు నేతలు ఆఖరికి తాము ధరించే దుస్తులు, ఇతర సామగ్రిని కూడా చేత్తో మోసిన పాపాన పోవడం లేదు.

 

ఈ రోజు ఢిల్లీకి చేరుకున్న స్వీడన్ రాజు 16వ కార్ల్ గుస్తాఫ్ ఇందుకు పూర్తి భిన్నం. భార్య సిల్వియాతో కలసి హస్తిన చేరుకున్న ఆయన నిరాడంబరత, వినయం చూసి జనం విస్తుబోతున్నారు. రాజావారు తన సూట్ కేసులను స్వయంగా మోసుకుంటూ విమానం దిగారు. ఈ ఫోటోలు సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన్ను చూసి మన నేతలు చాలా నేర్చుకోవాల్సి ఉందని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.