రూ. 2 కోట్ల ఫ్రెండ్ కారుతో గోడకు బొక్క..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

 రూ. 2 కోట్ల ఫ్రెండ్ కారుతో గోడకు బొక్క..(వీడియో)

August 14, 2020

Spain Man rams friend’s Lamborghini Huracan into wall, leaves vehicle in shambles.

ఒకరి వస్తువును అవసరం కోసం అరువు తీసుకుని వాడుకోవడం మామూలే. టూవీలర్ల నుంచి కార్ల వరకు ‘అలా వెళ్లొస్తాం..’ అని తీసుకుంటూ ఉంటాం. ఎలా తీసుకున్నామో, అలా పువ్వుల్లో పెట్టి ఇస్తుంటాం. స్పెయిన్‌లోని హుయాల్వా అనే పట్టణంలో ఓ యువకుడు కూడా ఫ్రెండుకు చెందిన ఓ కారును ‘అలా షికారుకు వెళ్లొస్తాం, ఇచ్చెయ్ గురూ.. ’ అని తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఆ కారును ఏకంగా ఓ గోడకు ఢీకొట్టి పెద్ద బొక్క పెట్టేశాడు! మామూ కారు, సగటు కారు, తక్కువ ధర కారు అయ్యుంటే ఇది వార్త కాకపోయేది. అతడు గుద్దింది రూ. 2కోట్లకుపైగా విలువై లాంబోర్గినీ కారును!  ప్రమాదంలో కారు నామరూపాల్లేకుండా మారిపోయింది. 

లాంబోర్గినీ హురాకన్ కారులో కొందరు యువకులు సరదాగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏకంగా  ఎలక్ట్రిసీటీ సబ్‌స్టేషన్ ఆఫీసు గోడను కారు గట్టిగా ఢీకొట్టింది. ఆ ధాటికి గోడకు పెద్ద బొక్క పడింది. కొందరి గాయాలయ్యాయి. కొందరు పారిపోయారు. అయితే పోలీసులు అందర్నీ పట్టుకుని కేసు పెట్టేశారు. నిర్లక్ష్యంగా నడపడం, ప్రభుత్వాస్తులకు నష్టం తదితర కేసులు నమోదయ్యాయి. తీవ్రగా గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.