స్పెయిన్‌లోనూ లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. - MicTv.in - Telugu News
mictv telugu

స్పెయిన్‌లోనూ లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు..

April 1, 2020

Spain reports more than 100,000 coronavirus cases

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరప్ దేశాలను వణిస్తోంది. కరోనా వైరస్ ప్రభావానికి అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్ష మైలురాయి దాటినా సంగతి తెల్సిందే. తాజాగా స్పెయిన్ లోనూ కరోనా వైరస్ కేసులు లక్ష మార్క్ ను దాటాయి.

బుధవారం రాత్రికి రాత్రే రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మంగళవారం దేశవ్యాప్తంగా 94,417 పాజిటివ్ కేసులు ఉండగా.. అవి బుధవారం నాటికి.. 1,02,136కి పెరిగాయి. స్పెయిన్ లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. మంగళవారం నాటికి 8,189మంది ఈ వైరస్ సోకి మరణించగా.. ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో 864 మరణాలు సంభవించాయి. దీంతో బుధవారం నాటికి స్పెయిన్ కరోనా మరణాల సంఖ్య 9,053కి చేరింది.