స్పెయిన్‌లో ఒకేరోజు 1500 మందికి కరోనా! - MicTv.in - Telugu News
mictv telugu

స్పెయిన్‌లో ఒకేరోజు 1500 మందికి కరోనా!

March 15, 2020

Spain set to declare national lockdown due to Coronavirus

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5,835 మంది చనిపోగా, 1,56,000 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ను కట్టడిచేయడానికి వివిధ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా ఈ వైరస్ స్పెయిన్‌ దేశాన్ని వణికిస్తోంది. స్పెయిన్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఆ దేశ మంత్రి ఇరేనే మాంటెరో కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. గత 24 గంటల్లో ఏకంగా 1500 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కరి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 5,753కు చేరుకుంది. వీటిలో దాదాపు మూడు వేల మంది బాధితులు దేశ రాజధాని మాడ్రిడ్‌కు చెందినవారే కావడం ఆందోళనకు గురి చేస్తున్న విషయం. కాగా, శుక్రవారం నాటికి ఆ దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 120కి చేరుకుంది. మరోవైపు ఒకే రోజు 1500 కేసులు నమోదు కావడంతో మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. పదిహేను రోజులపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించింది.