కాపురాన్ని కూల్చిన వర్క్ ఫ్రమ్ హోం.. నగ్నంగా లైవ్‌లోకి వచ్చిన లవర్
ఓ కాపురంలో వర్క్ ఫ్రం హోమ్ చిచ్చు రేపింది. భార్యకు తెలియకుండా అతను మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. సంస్థ సిబ్బంది గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుతుండగా అతని గర్ల్‌ఫ్రెండ్ మధ్యలో దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో అతని భార్యకు చేరడంతో ఆమె అతనితో జీవించలేనని ఖరాఖండిగా చెప్పేసింది. స్పెయిన్‌కు చెందిన జర్నలిస్ట్ అల్ఫాన్సో మెర్లోస్ ఇంటి నుంచి పనిచేస్తూ లైవ్‌లో సమాచారం అందిస్తున్నాడు. మరో జర్నలిస్ట్ జవియర్ నెగ్రే నిర్వహిస్తున్న ‘స్టేట్ ఆఫ్ అలారం’ అనే యూట్యూబ్ చానెల్‌లో మెర్లోస్ గెస్టుగా మాట్లాడాడు. ఆ సమయంలో అతడి వెనకాల నుంచి లోదుస్తులు మాత్రమే ధరించిన అతని గర్ల్‌ఫ్రెండ్ అర్థనగ్నంగా నడుచుకుని వెళ్లడం లైవ్‌లో కనిపించింది.
ఆమెను వీడియోలో చూసిన నెగ్రే వెంటనే అతడని అప్రమత్తం చేశాడు. కానీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఆ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో కాస్తా అతని భార్య వద్దకు చేరడంతో.. అర్థనగ్నంగా కనిపించిన సదరు యువతి అతడి భార్య మార్తా లోపెజ్ కాదట. ఆమె ఓ స్పెయిన్‌కు చెందిన ఓ టీవీ రిపోర్టర్ అలెక్సియా రివాస్ అని తెలిసింది.
ఆ జర్నలిస్టు భార్య మరెవరో కాదు.. ‘బిగ్ బ్రదర్’ షో మాజీ కంటెస్టెంట్ మార్తా లోపెజ్. ఇక అతడితో కలిసి జీవించేది లేదని, అతడి నుంచి విడిపోతున్నానని మార్తా లోపెజ్ మీడియా ముందు వెల్లడించింది. మొత్తానికి ఆ లైవ్ కార్యక్రమంతో ఓ జంట విడిపోయింది. కాగా, వర్క్ ఫ్రం హోమ్ వల్ల పని నైపుణ్యం బాగా పెరిగిందని వివిధ సంస్థలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే వీడియో కాల్స్‌లో బాసులతో మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగితోపాటు ఇంట్లోవాళ్లు కూడా చక్కగా దుస్తులు ధరించాలి. లేకపోతే.. ఈ రిపోర్టర్‌కు ఎదురైన పరిస్థితే ఎదురవుతుంది.