తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. బుధవారం జరిగే చర్చలో కొశ్చన్ అవర్ రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. రూల్ 38 ప్రకారం స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో స్పష్టం చేశారు. ఈ పరిణామంతో నేరుగా బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. ఈ విషయాన్ని శాసనసభ సభ్యులు గమనించాలని ఆయన కోరారు.