ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్.. ఆటోమేటిక్ సస్పెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్.. ఆటోమేటిక్ సస్పెన్షన్

March 15, 2022

001

అసెంబ్లీలో పోడియం వద్దకు వచ్చి నిరసనలు తెలుపుతున్న ప్రతిపక్షాలకు అడ్డుకట్ట వేసేలా స్పీకర్ తమ్మినేని సీతారాం కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఇకపై పోడియం వైపు దూసుకొస్తే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయ్యేట్టు రూలింగ్‌ను తీసుకువస్తున్నట్టు తెలిపారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు గీతలను ఏర్పాటు చేశారు.సభ్యలెవరైనా ఎరుపు గీత దాటితే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అవుతారు. అలాంటి సభ్యులను బయటకు పంపడానికి సభ అనుమతి కూడా అవసరం లేకుండా ఈ నిబంధనను రూపొందించారు. కాగా, జంగారెడ్డి గూడెం ఘటనకు సంబంధించి టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుకు అడ్డుకట్ట వేసేలా ఈ నిబంధన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది..