సంస్కృతం మాట్లాడితే కొవ్వు తగ్గుతుంది..బీజేపీ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

సంస్కృతం మాట్లాడితే కొవ్వు తగ్గుతుంది..బీజేపీ ఎంపీ

December 13, 2019

Speaking Sanskrit.

గతంలో బీజేపీ ఎంపీ సాద్వి ఠాకూర్ మాట్లాడుతూ..గో మూత్రం తాగితే క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తుందని తెలిపిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. తాజాగా మరో బీజేపీ ఎంపీ గణేశ్ సింగ్ లోక్‌సభలో ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. 

రోజూ సంస్కృతం మాట్లాడితే మధుమేహం, కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చని చెప్పారు. సంస్కృతం మాట్లాడటం ద్వారా నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుందన్నారు. కొన్ని ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97శాతం భాషలకు సంస్కృతమే ఆధారమన్నారు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్ సంస్కృతంలో జరిపితే సిస్టమ్ ఆగకుండా పనిచేస్తుందన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. సంస్కృత విశ్వవిద్యాలయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.