ఆర్టీసీ మహిళ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ మహిళ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు!

December 1, 2019

telangana rtc women01

సీఎం కేసీఆర్ ఆర్టీసీ మహిళా కార్మికులపై వరాలు జల్లు కురిపించారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు, డిపో మేనేజర్లు ఈడిలతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. సమావేశానికి ముందు వారితో కలిసి భోజనం చేశారు. తెలంగాణలోని మొత్తం 97 డిపోలు ఉండగా ఒక్కో డిపో నుంచి ఐదుగురు కార్మికులుగా మొత్తం 750మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. వారిలో ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఆర్టీసీ స్థితిగతులను కార్మికులకు కూలంకషంగా వివరించారు. కార్మికులకు అర్ధమయ్యే రీతితో ఆర్టీసీ పరిస్థితిపై బుక్‌లెట్ అందించారు. మహిళా కార్మికుల సమస్యలపై చర్చించి, కీలక ప్రకటన చేశారు. డే సమయంలో మాత్రమే మహిళ ఉద్యోగులు, కార్మికులకు డ్యూటీ విధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రసూతి సెలవులను పెంచారు. బేబీ కేర్ టేకర్ సెలవులు మంజూరు చేయాలనీ తెలిపారు. మహిళ కార్మికుల భద్రతపై మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో భేటీ తరువాత.. కేసీఆర్ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. ఈనెల 3న ప్రధాని మోడీతో భేటీ అవుతారు.