ఎన్టీఆర్ అమ్మగారితో నాకు ప్రత్యేక అనుబంధం : యశ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ అమ్మగారితో నాకు ప్రత్యేక అనుబంధం : యశ్

April 15, 2022

ntr

కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో ప్యాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఏర్పరచుకున్న క్రేజీ హీరో యశ్ తెలుగు హీరోలతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. షూటింగ్ నిమిత్తం ఎప్పుడు హైదరాబాదుకు వచ్చినా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తనకు భోజనం పంపిస్తాడని వెల్లడించాడు. అలాగే ఎన్టీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి మాట్లాడాడు. ‘ఎన్టీఆర్ ఒకరోజు నన్ను వాళ్లింటికి డిన్నర్‌కి ఆహ్వానించాడు. నేను వెళ్లినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఒక బిడ్డలాగా చూసుకున్నారు. ఆవిడ కర్ణాటకకు చెందిన వారు కావడంతో మా ఇద్దరి మధ్య ప్రాంతీయ అభిమానం ఉంది. వాళ్లింట్లో కుటుంబసభ్యుడిగా ఆదరించారు. వాళ్లు నాకిచ్చిన గౌరవ మర్యాదలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని వెల్లడించారు.