హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు సిద్ధం.. ఒకే షరతు  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు సిద్ధం.. ఒకే షరతు 

May 14, 2020

Special buses from Hyderabad to Andhra Pradesh 

హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లడానికి ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఎవరైనా సరే వీటిలో స్వస్థలాలకు వెళ్లొచ్చు. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. అయితే ఒక షరతు పాటిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తారు. బస్సు దిగగానే క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాలి. దీనికి ఒప్పుకుంటేనే టికెట్లు ఇస్తారు. పనుల వల్ల హైదారాబాద్ వచ్చి చిక్కుకుపోయిన వారితోపాటు, నగరంలో ఉద్యోగాలు చేసుకుంటూ అత్యవసర పనులపై ఊళ్లకు వెళ్లలేకపోతున్న వారి కోసం ఏపీ ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించింది. ప్రత్యేక బస్సులు మియాపూర్-బొల్లారం క్రాస్‌రోడ్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, ఎల్బీనగర్ నుంచి వెళ్తాయి. మధ్యలో ఎక్కడా ఆగవు.

చార్జీలను కూడా కూడా సవరించారు. ఏసీ బస్సులో గరుడ చార్జీలను, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ చార్జీలు వసూలు చేస్తారు. బస్సుల్లో ఎక్కాలనుకునేవారు మొదట స్పందన పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. అక్కడ పేర్కొన్న షరతులను చదివి టెకెట్ల తీసుకోవాలి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 13 వేల మంది ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి 8 వేల మంది, రంగారెడ్డి నుంచి 5 వేల మంది ఉన్నారు. బెంగళూరు, చెన్నైల నుంచి కూడా ఏపీ వాసులను స్వస్థలాలకు తరించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.