హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

April 9, 2022

bfbfd

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ నవమి సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి భద్రాచలానికి 70 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సీత,రాముల కళ్యాణాన్ని వీక్షించటం కోసం, అనంతరం వారిని దర్శించుకోవటం కోసం వందలాది భక్తులు భద్రాచలం వెళ్లనున్న నేపథ్యంలో ప్రయణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా భక్తుల కోసం ఏప్రిల్ 9,10 తేదీల్లో రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా 70 స్పెషల్‌ సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఎంజీబీఎస్‌తోపాటు ఎల్‌బీనగర్‌ ముఖ్య కూడళ్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, రిజర్వేషన్‌ కౌంటర్ల నుంచి టికెట్లు బుక్‌చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతేకాకుండా రద్దీ పెరిగితే బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని అధికారులు తెలిపారు.