గతేడాది హైదరాబాద్లో వచ్చిన వరదల అనుభవంతో ప్రత్యేకంగా వరద కాలువల నిర్మాణానికి అనుమతించినట్టు మంత్రి కేటీఆర్ శనివార అసెంబ్లీలో తెలిపారు. మురుగు నీరు, వరద నీరు కోసం వేర్వేరు కాల్వలను నిర్మిస్తున్నామని, తానే స్వయంగా పనుల పురోగతిని వారానికి ఒకసారి సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. వరద నీటి నిర్వహణ కోసం ఇప్పటికే ముగ్గురు ఇంజనీర్లను నియమించినట్టు పేర్కొన్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీలో రూ. 735 కోట్లు, కొంపల్లి, జల్పల్లిలలో రూ. 250 కోట్ల ఖర్చుతో 60 పనులను చేపట్టామన్నారు. వానాకాలం వచ్చేలోపు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని వివరించారు. అలాగే నాలాలను కబ్జా చేసి వేల ఇళ్లు నిర్మించారనీ, 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేశాయని విమర్శించారు.