మందుబాబులకు షాక్.. లిక్కర్‌పై కరోనా ఫీజు వసూలు - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు షాక్.. లిక్కర్‌పై కరోనా ఫీజు వసూలు

May 5, 2020

Special Corona Fee on Liquor in Delhi

గత 40 రోజులకు పైగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూతబడిపోయాయి. చుక్క దొరక్క ముందుబాబులు దిక్కులు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో చివరకు కొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ డోర్లు తెరిచారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ఢిల్లీలోనూ వైన్ షాపులు తెరవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని అంత సులువుగా తెరిచే ప్రయత్నం చేయలేదు. ఏకంగా లిక్కర్ బాటిల్‌పై దాదాపు 70 శాతం మేర పన్ను పెంచుతున్నట్టు ప్రకటించింది. 

కరోనా ఫీజు కింద ఈ మొత్తాన్ని వసూలు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేశారు. కరోనా ఫీజు ద్వారా ఆర్థిక నష్టాన్ని పూడ్చే పనిలో పడ్డారు. మద్యం షాపులు తెరిచిన వెంటనే రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందుగానే ఊహించిన ఢిల్లీ సర్కార్  ఈ చర్యలకు ఉపక్రమించింది.  రిటైల్ లైసెన్సుల కింద విక్రయించే అన్ని ర‌కాల లిక్కర్ బాటిళ్లపై 70 శాతం పన్నువిధించారు. అంటే రూ. 100 ఉన్న బాటిల్ తాజాగా  రూ .170కు పెరిగిన‌ట్ల‌య్యింది. అయినప్పటికీ లాక్‌డౌన్‌లో నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ, మ‌ద్యం దుకాణాల‌ను తెరిచిన వెంటనే రద్దీ మందు బాబులు వైన్ షాపుల ఎదుట క్యూ కట్టడం విశేషం.