పట్టుదల ఉంటే సాధ్యం కానిదేదీ లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు దూసుకుపోతారు. ఎస్ఐ శ్వేత అలాంటి విజేత. ఇంట్లోవాళ్లు పదో తరగతిలోనే ఆమెకు పెళ్లి చేశారు. తర్వాత పిల్లలు, వాళ్ల చదువులు.. అయినా ఆమె చదువుపై ఆశ చంపుకోలేదు. భర్త ప్రోత్సాహంతో డిస్టన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేశారు. టీటీసీ పూర్తయింది. టీచర్ పోస్టులే కాదు పోలీస్ కొలువులూ ఉన్నాయనుకుంది.
శ్వేత కానిస్టేబుల్ అయ్యారు. తర్వాత ఎస్ఐ అయ్యారు. తక్కువ సర్వీసు కాలంలో అద్భుతమైన పనితీరుతో బెస్ట్ ఎస్ఐ సహా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించారు. జీవితంలో ఏవే అనుకోనివి జరిగిపోయినంత మాత్రాన నిరుత్సాహ పడకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని రుజువు చేశారు. ఉద్యోగాలు, కెరీర్ కోసం దిక్కుల చూస్తున్న విద్యార్థులకు, యువతీయువకులకు స్పూర్తిగా నిలిచిన ఎస్ఐ శ్వేతను మైక్ టీవీ పలకరించింది. ఆమె అంతరంగం, యువతకు ఇచ్చే సూచనలు సలహాలు ఏమిటో చూడండి మరి..