Special response to Agnipath .. 1.83 lakh applications in 6 days
mictv telugu

అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 6 రోజుల్లో 1.83 లక్షల దరఖాస్తులు

June 29, 2022

త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం మరింత పెంచేలా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. విపక్షాలు విమర్శలు, ఆర్మీ అభ్యర్థుల విధ్వంస కాండతో నిరసనలు మిన్నంటాయి. అయితే కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్తామని స్పష్టం చేసింది. అంతేకాక, ఏకంగా భారత వాయుసేనలో ఈ పథకం కింద నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా జూన్ 24న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఆరు రోజుల వ్యవధిలో ఏకంగా 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై 5 వరకు ఉండే ఈ గడువులో మరింత మంది దరఖాస్తు చేసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. 17 నుంచి 21 ఏళ్ల యువత దీనికి అర్హులు. మిగతా వివరాలకు నోటిఫికేషన్ చూడగలరు. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా నియామకాలు జరుపకపోవడంతో గరిష్ట వయసును 23 ఏళ్లకు పెంచారు.