దసరాకు..ప్రత్యేక రైళ్లు, బస్సుల వివరాలు - MicTv.in - Telugu News
mictv telugu

దసరాకు..ప్రత్యేక రైళ్లు, బస్సుల వివరాలు

September 24, 2019

dasara festival....

ఈ ఏడాది అక్టోబర్ 8న దసరా పండుగ జరుగనుంది. దసరా పండుగ జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి లక్షల మంది సొంత ఊళ్లకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే దసరాకు ప్రత్యేక రైళ్లను నడుపబోతోంది. సికింద్రాబాద్ -కాకినాడ -నర్సాపూర్ -నాగర్‌సోల్ -విల్లుపురం స్టేషన్‌ల మధ్య ఈ ప్రత్యేక రైళ్ల నడువనున్నాయి. అక్టోబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు నడుస్తాయి. అలాగే తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపనుంది.

 

ప్రత్యేక రైళ్లు:

 

*  07003-07004- 07075 నంబర్ రైళ్లు సికింద్రాబాద్-కాకినాడ మధ్య వారానికి ఒకసారి వెళ్తాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, భీమవరం, తణుకు, రాజమండ్రి, కాకినాడకు వెళ్తాయి. తిరిగి అదే మార్గంలో వెనక్కి వస్తాయి.

 

* 07434-07428 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మధ్య నడుస్తాయి.

 

* 07256-07255  నంబర్ రైళ్లు సికింద్రాబాద్-నర్సాపూర్ మధ్య నడుస్తాయి.

 

* 07145-07063-07064-07063  నంబర్ రైళ్లు సికింద్రాబాద్-నాగర్‌సోల్ మధ్య నడుస్తాయి.

 

* 06043-06044  నంబర్ రైళ్లు సికింద్రాబాద్-విల్లుపురం మధ్య నడుస్తాయి. ఈ రైలు సికింద్రాబాద్, నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, ఒంగోలు, సూళురుపేట, చెన్నై చంగల్‌పట్టు మీదుగా విల్లుపురం చేరుతాయి.

 

* 22351-22353  నంబర్ రైళ్లు యశ్వంత్ పూర్-పాటలీపుత్ర మధ్య నడుస్తాయి.

 

ప్రత్యేక బస్సులు:

 

ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొంది. గత ఏడాది దసరాకు 4900 బస్సులు నడిపగా… ఈసారి 4,933 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపింది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు 3,236 ప్రత్యేక బస్సు సర్వీసులు నడువనున్నాయి. అక్టోబర్ 4వ తేదీన 749 బస్సులు, అక్టోబర్ 5వ తేదీన 964 బస్సులు నడుస్తాయి. అక్టోబర్ 6వ తేదీన 712 బస్సులు నడుస్తాయి. అక్టోబర్ 7వ తేదీ, 8వ తేదీన 72 ప్రత్యేక బస్సులు నడుపనుంది. 964 బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడుపనుంది.