హైదరాబాదీలకు హెచ్చరిక.. 40 స్పీడ్ దాటితే అంతే - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదీలకు హెచ్చరిక.. 40 స్పీడ్ దాటితే అంతే

January 20, 2020

Flyovers

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లపై గతంలో దూసుకెళ్లినట్టుగా వెళ్దామంటే కుదరదు. వేగాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు అధికారులు ప్రారంభించారు. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలో మరెక్కడా ఫ్లైఓవర్లపై ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అన్ని వంతెనలపై వేగ పరిమితి నిబంధన అమల్లోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. 

ఇక నుంచి అన్ని ఫ్లైఓవర్లపై వాహనాలు 40 కి.మీ వేగానికి మించి వెళ్లకుండా నిబంధనలు తీసుకురాబోతున్నారు. ఎవరైనా వేగంగా వెళితే భారీగా జరిమానా విధించేందుకు  మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్‌లో ఉన్న వంతెనలపై ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. త్వరలోనే దీన్ని నగరమంతా వ్యాప్తి చేయనున్నారు. ప్రతి ఫ్లైఓవర్‌పై సూచికలను ఏర్పాటు చేయనున్నారు. 

బయోడైవర్సిటీ పైవంతెనపై వేగ పరిమితి దాటిన ప్రతి వాహనానికి జరిమానా విధిస్తుండటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఆ దిశగా జీహెచ్ఎంసీ సూచికలతో పాటు థర్మోప్లాస్టిక్‌ రంబుల్‌ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా రంబుల్ స్ట్రిప్స్‌పై వాహనదారులు అభ్యంతరం చెబుతున్నారు. వాటి వల్ల తమకు నడుం నొప్పి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. తాజా నిర్ణయంతో ఇక నుంచి నగరంలో వాహనాలు ఫ్లైఓవర్లపై పరిమిత వేగంతో వెళ్లాల్సి ఉంటుంది.